ఎల్కతుర్తి అభివృద్ధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర.

ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ 

ఎల్కతుర్తి అభివృద్ధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర.

ఎల్కతుర్తి, మే 23( తెలంగాణ ముచ్చట్లు) 

ఎల్కతుర్తి గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతగా శుక్రవారం ఎల్కతుర్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించడం గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేసే నిర్ణయమని అన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ రాజు, పాక రమేష్, శనిగరం వెంకటేష్, డాక్టర్ రమేష్, పి. రమేష్, బుచ్చి రాములు, మల్లాచారి, నవీన్, వసంత, సారయ్య, ప్రత్యూష, కిరణ్, వెంకటరమణ, అర్జున్, సాహూ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News