వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

ఎన్టీఆర్ మధుర గీతాలతో ఆలపించిన వనపర్తి గాయకులు.

వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

వనపర్తి,మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం వనపర్తి పట్టణ కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆయన సినీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని సాధారణ స్థాయి నుంచి మహానటుడిగా ఎదిగిన చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.సినీ పరిశ్రమలో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు.ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో ఆయన నటన తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.తెలుగు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేసేలా ఎన్నో సందేశాత్మక, భక్తి, అభ్యుదయ చిత్రాలను రూపొందించి సమాజ చైతన్యానికి ఎన్టీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు.ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం తెలుగు ప్రజల బాధ్యత అని తెలిపారు.కార్యక్రమంలో వనపర్తి కళాకారులు, గాయకులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రాల్లోని మధుర గీతాలను ఆలపించి శ్రోతలను అలరించారు.రానున్న రోజుల్లో కూడా ప్రజల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నందిమల్ల రాములు, డి. రవిప్రసాద్, గంధం రాజు, గంధం రవి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఆర్ఎంఓ రవిశంకర్, ఎస్. రవిప్రసాద్ గౌడ్, హెచ్. గోవింద్, వెంకట్ తదితరులు హాజరయ్యారు.అలాగే నందిమల్ల సాంబయ్య, ఎం. సంజీవ్, డీఎస్పీ నాయకులు భీముడు, సూర్యప్రకాశ్, డి. గట్టయ్య, బి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .