తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారుల జెఏసి వ్యవస్థాపకుడు పిడమర్తి రవి.
హైదరాబాద్,మే28(తెలంగాణ ముచ్చట్లు):
జూన్ 21న ఇంద్రపార్క్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు.వనపర్తి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాన్ని ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉల్యంకొండ రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డులు, పింఛన్ కల్పించాలని ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జూన్ 21న జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర్ల సత్యం, ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎండీ రహీం, అన్వర్, పీయూ జేఏసీ నాయకులు, ప్రజా వాగ్గేయకారులు రాజారాం ప్రకాష్, తెలంగాణ గాంధీ యాదగిరి, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, ముప్పారం కుమార్, రొడ్డ నిరంజన్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments