కౌన్సిలర్ ఫిర్యాదుతో అర్ధరాత్రే సమస్య పరిష్కారానికి చర్యలు.

కౌన్సిలర్ ఫిర్యాదుతో అర్ధరాత్రే సమస్య పరిష్కారానికి చర్యలు.

జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలోని రామన్నపల్లి 3వ వార్డులో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, స్థానిక కౌన్సిలర్ ఫోన్‌కే మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

3వ వార్డు కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు ఎండాకాలంలో వార్డులో నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాత్రి సమయంలోనే మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గేట్ వాల్ లీకేజీ కారణంగా సమస్య తలెత్తిందని వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఏఈ వికాస్‌తో కలిసి ఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. తక్షణ చర్యలు తీసుకుని నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తమ పాలకవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందిస్తామని చైర్మన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈ వికాస్, మిషన్ భగీరథ ఏఈ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .