జర్నలిస్టులు ప్రజల సమస్యలకు వారధిగా నిలవాలి: ప్రణవ్ బాబు.
Views: 10
On
హుజురాబాద్, మే 19(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్‌లో మంగళవారం ప్రెస్ క్లబ్ మీడియా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి జర్నలిస్టులు వారధిగా పనిచేయాలని ఆయన కోరారు. సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్టు సుదర్శన్ కుటుంబానికి ప్రమాద బీమా పోస్టల్ బాండ్‌ను ప్రణవ్ బాబు అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, పలువురు జర్నలిస్టులు, విలేకరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments