హుజురాబాద్‌లో ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

హుజురాబాద్‌లో ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

హుజురాబాద్,మే 19(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణంలో పోలీసులు ముమ్మర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా అప్రమత్తం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులను ఆపి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, హెల్మెట్, లైసెన్స్ తదితరాలను కూడా పరిశీలించారు.
ప్రజల భద్రత కోసమే ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. హుజురాబాద్‌,జమ్మికుంట ప్రధాన రహదారి నేషనల్ హైవే వద్ద ఈ తనిఖీలు కొనసాగించినట్లు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .