మరణానంతరం ఇద్దరికి చూపునిచ్చిన రావికంటి రాజయ్య నేత్రదానం.

మరణానంతరం ఇద్దరికి చూపునిచ్చిన రావికంటి రాజయ్య నేత్రదానం.

జమ్మికుంట టౌన్ మే 24 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ నివాసి రావికంటి రాజయ్య (80) వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో నేత్రదానానికి ముందుకు రావడంతో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించే మహత్తర సేవ జరిగింది.

డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు నేత్రదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా, వారు వెంటనే అంగీకారం తెలిపారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి ఆధ్వర్యంలో, వరంగల్ ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు.

కీర్తిశేషులు రావికంటి రాజయ్య నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు వెలుగునిచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమారులు, కోడళ్లు రావికంటి నీలకంఠం-శ్రీలత, వెంకటేశ్వర్లు-నీరజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సహకరించిన గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిటి కేసి శివానందయ్య, ముత్యాల జగదీశ్వర్, చిదురాల శ్రీనివాస్, వంగల రమేష్‌లతో పాటు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, లగిశెట్టి చంద్రమౌళి తదితరులు కుటుంబ సభ్యులను అభినందిస్తూ సంతాపం తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .