రాపాకపల్లిలో ఎమ్మార్పీఎస్ గద్దె నిర్మాణ పనులు ప్రారంభం .

రాపాకపల్లిలో ఎమ్మార్పీఎస్ గద్దె నిర్మాణ పనులు ప్రారంభం .

ధర్మసాగర్,మే26(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాపకపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పులిపాక చిరంజీవి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన గద్దె నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ హాజరై స్థానిక సర్పంచ్ కందుకూరి జయేందర్‌తో కలిసి ముగ్గు వేసి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ దీర్ఘకాల పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న వర్గీకరణ ఫలాలను గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు మధ్యలో నిలిచిపోయిన విద్యార్థులు మళ్లీ విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చదువుకునే యువతకు ఎమ్మార్పీఎస్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

అలాగే గ్రామాల సందర్శన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేసి ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమాన్ని ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి, ధర్మసాగర్ మండల ఇన్చార్జి గంగారపు శ్రీనివాస్ మాదిగ సమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్మడి సురేష్, కందుకూరి కరుణాకర్ మాదిగ, కందుకూరి శ్యామ్ సుందర్ మాదిగ, ఇమ్మడి ఉప్పలయ్య మాదిగ, ఇమ్మడి కరుణాకర్ మాదిగ, వస్కుల దేవరాజ్ మాదిగ, కందుకూరి కరణ్ మాదిగ, కందుకూరి మల్లేశం మాదిగతో పాటు పలువురు గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.IMG-20260526-WA0059

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .