సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.

సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.

ఎల్కతుర్తి, మే 22( తెలంగాణ ముచ్చట్లు):

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త గొర్రె మహేందర్‌కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” పురస్కారం లభించింది. 2025-26 సంవత్సరానికి గాను మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. శుక్రవారం హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా గొర్రె మహేందర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా గొర్రె మహేందర్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గొర్రె మహేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .