బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం

జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిషోర బాలికల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రారంభించారు. మెప్మా, వావిలాల ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వైద్యురాలు చందన కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు హిమోగ్లోబిన్, షుగర్ తదితర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే బాలికలకు ఆరోగ్య సంబంధిత సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ మొలుగు చందన, హెల్త్ సూపర్వైజర్ అరుణ, కొండపాక సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్‌ఎం రాధ, మెప్మా సిఎల్‌ఆర్పీలు జ్యోతి తదితరులు, ఆశా వర్కర్లు మరియు పలువురు కిషోర బాలికలు పాల్గొన్నారు.IMG-20260520-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .