బైక్ దొంగతనాలు చేసిన నిందితుడి అరెస్టు

బైక్ దొంగతనాలు చేసిన నిందితుడి అరెస్టు

*నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం*

*కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు*

మంచిర్యాల,మే 20(తెలంగాణ ముచ్చట్లు)

మందమర్రి పట్టణంలో ఇటీవల వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు, మందమర్రి సీఐ పర్స రమేష్ కథనం ప్రకారం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన గటాడి లక్ష్మీనారాయణ గతంలో ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడని సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు, ఎవరైనా తాళం వేయకుండా లేదా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా ఎంచుకొని మాస్టర్ కి ద్వారా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ద్విచక్ర వాహనాలను అపహరించేవాడని తెలిపారు, బుధవారం రోజున పట్టణంలో పోలీసులు జరిపిన తనిఖీలలో అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు వెల్లడించారు, నిందితుడి వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు, నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఎస్ఐ నరేష్ తో పాటు కానిస్టేబుళ్లు మహేష్, రాకేష్, చైతన్య లను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .