హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి.

మున్సిపల్ కమిషనర్ బి. కిషన్‌కు బీసీ ఆజాది ఫెడరేషన్ శుభాకాంక్షలు.

హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి.

హుజూరాబాద్, మే 20(తెలంగాణ ముచ్చట్లు ):

 హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. కిషన్‌ను బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు.
అభివృద్ధి, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, ప్రజా సేవలు తదితర అన్ని రంగాల్లో హుజూరాబాద్‌ను ఆదర్శంగా నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, కూడికల ప్రభాకర్, ఎం.డి. బాబర్, పోతారపు అశోక్, ఆళ్ల కేశ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .