ఎన్టీఆర్ ఆశయాలు ఆదర్శం.

గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నివాళి.

ఎన్టీఆర్ ఆశయాలు ఆదర్శం.

దమ్మపేట, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): 

తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ రాజకీయాలతో పాటు సినీరంగంలోనూ విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. తెలుగువారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .