విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం.

విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం.

వేలేరు, మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బొల్లం రాజు నాయకత్వంలో పదో తరగతి విద్యార్థులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిల్లా యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు.అనంతరం సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, క్రమశిక్షణతో చదివి జీవితంలో విజయాలను సాధించాలని సూచించారు. మొత్తం 50 మంది పదో తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ అందించబడిందన్నారు.ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ శ్రీకర్ పాల్గొన్నారు. అలాగే శిక్షణ తరగతుల నిర్వహణ కోసం హాల్ భవనాన్ని అందించిIMG-20260530-WA0071న రవిని నిర్వాహకులు అభినందించారు.కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .