మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.

మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఉమెన్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా శనివారం జమ్మికుంట పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మెప్మా ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా ఉత్తమంగా పనిచేసిన సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు పురస్కారాలు అందజేశారు. అలాగే కొత్త సంఘాల ఏర్పాటు, లోన్ మేళా కార్యక్రమాలు నిర్వహించి, 16 మహిళా సంఘాలకు సంబంధించిన రూ.1.95 కోట్ల జంబో చెక్కును అందజేశారు.

మహిళా సంఘాల సభ్యులకు భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా మున్సిపాలిటీ తరఫున పూర్తి మద్దతు అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఆర్‌ఎం మధర్, మేనేజర్ రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు కొలుగూరి సురేష్, చుంచు రమాదేవి, చందా రాజు, ఫిరోజ్, పాతకాల మౌనిక, శ్రీపతి స్వర్ణలత, మంద రాధ, ఎగిత సుజాత, దిడ్డి కోమల, సీఎల్‌ఆర్పీలు జ్యోతి, మంజుల, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి గీత, స్వర్ణరేఖ, టీఎల్‌ఎఫ్ ఆర్‌పీలు, ఓబీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260530-WA0080

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .