ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
హుజూరాబాద్, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద హుజూరాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డులో లబ్ధిదారురాలు కొలుగూరి సునీత-రవికుమార్ దంపతుల నూతన గృహాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ సందమల్ల పుణ్యబాబు పాల్గొని గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఈ గృహాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కిషన్ హాజరయ్యారు. అలాగే మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, హౌసింగ్ ఏఈ రోజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగా అనిల్, కొలుగూరి సమ్మయ్య, కొయ్యడ రాజేష్, మహేందర్, కుక్కమూడి మొగిలి తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇల్లు పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Comments