హుజూరాబాద్ సిఎస్ఐ చర్చిలో రెవ. జాన్ బాబు దంపతులకు ఘన వీడ్కోలు.

హుజూరాబాద్ సిఎస్ఐ చర్చిలో రెవ. జాన్ బాబు దంపతులకు ఘన వీడ్కోలు.

హుజూరాబాద్, మే 31 (తెలంగాణ ముచ్చట్లు): 

హుజూరాబాద్ సిఎస్ఐ చర్చిలో ఆదివారం రెవ. ఈసంపల్లి జాన్ బాబు, విజయమ్మ దంపతులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. దక్షిణ భారత సంఘం (సిఎస్ఐ) పరిధిలోని కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలను కలుపుకుని ఏర్పడిన డయాసిస్‌లో భాగంగా గురువులకు నిర్దిష్ట కాల వ్యవధిలో బదిలీలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా హుజూరాబాద్ ఫాస్టరేట్ చైర్మన్‌గా సేవలందించిన రెవ. ఈసంపల్లి జాన్ బాబు వరంగల్ జిల్లా దేశాయిపేటకు బదిలీ కావడంతో సంఘస్తులు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవ. జాన్ బాబు దంపతులు హుజూరాబాద్ సంఘానికి అందించిన సేవలను కొనియాడుతూ పలువురు మాట్లాడారు. అనంతరం వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫాస్టరేట్ కార్యదర్శి సొల్లు బాబు, కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు, యువత, మహిళలు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గూడెపు రవీందర్, సొల్లు మహేందర్, బి. కనకలక్ష్మి, వై. పుష్పలత, జి. సురేఖ, బూర్ల కాంతమ్మ, కె. సంపత్, ఎ. నీలమ్మ, ఎలియా, ఎ. రాజయ్య, ఈ. బంగారి, ఆకునూరి సిద్దు, అర్చన, కడారి శంకర్, కె. రాజేశ్వరి, కె. సబిత, ఎ. శారద, కె. సుకన్య, ఎం. సుధాకర్, ముద్దమల్ల భాస్కర్, సొల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
– ఫాస్టరేట్ కమిటీ కార్యదర్శి సొల్లు బాబు మరియు కమిటీ సభ్యులు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .