సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు.

నిరుపేద విద్యార్థినికి పుస్తకాలు, విద్యా సహాయం.

సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు.

సత్తుపల్లి, మే 31(తెలంగాణ ముచ్చట్లు): 

సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతిని పురస్కరించుకొని మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ–మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థిని, 8వ తరగతి చదువుతున్న శ్రీ శరణ్యకు పుస్తకాలను అందజేశారు. అదేవిధంగా విద్యార్థిని విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజును కూడా ఫౌండేషన్ తరఫున అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజ సేవతో పాటు విద్యార్థులకు అండగా నిలవడం సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిమాన సంఘ నాయకులు కోటమర్తి వెంకటేశ్వరరావు, రాంబాబు, శ్రీరామమూర్తి, చంద్రశేఖర్, సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే విజయవాడ నుంచి ఫౌండేషన్ ప్రతినిధులు సారథి, రబ్బాని హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫౌండేషన్ సభ్యులు, అభిమాన సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .