అమ్మపల్లిలో విషాదం.. ఎద్దుల బండి ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి.
Views: 5
On
పెద్దమందడి,జూన్01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన దేసు సాత్విక్ (12) ఎద్దుల బండిపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సాత్విక్ ఎద్దుల బండిపై ప్రయాణిస్తుండగా అదుపు తప్పి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.బాలుడి అకాల మరణంతో అమ్మపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గ్రామస్థులు సాత్విక్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments