వేలేరు గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .
వేలేరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నామని పేర్కొన్నారు. గ్రామాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేలా తన పరిపాలన ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి డ్రెస్సులు, బ్లౌజులు, చెప్పులు, మాస్కులు, సబ్బులు, నూనె తదితర శానిటేషన్ సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, ఏపీఎం అనిత, ఎంఎస్ అధ్యక్షురాలు రేణుక, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, సీసీ రమాదేవి, పీహెచ్‌సీ డాక్టర్ మేఘన, ఏఈఓ రాజశేఖర్, వివో అధ్యక్షురాలు, సీఏఎస్, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, ప్రవళిక, పర్వీన్, సంధ్య, మౌనిక, సునీల్ తదితరులు పాల్గొన్నారు.


Comments