ఆగిన రోడ్లే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం.

దమ్మపేటలో పెండింగ్ పనుల పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

ఆగిన రోడ్లే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం.

దమ్మపేట, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు): 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు స్తంభించిపోయాయని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  మంగళవారం దమ్మపేట మండలంలోని అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన అభివృద్ధి పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, గత ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిన పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని ఆరోపించారు. కొత్త పనులు తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం, ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే ముందు, అసంపూర్తిగా ఉన్న పనులపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్మపేట మండలంలో నిలిచిపోయిన రోడ్డు పనులే ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేకపోతే ప్రజల తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

 అసంపూర్తిగా ఉన్న రోడ్లు

మల్లారం రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
గాంధీనగర్–మందలపల్లి రహదారి పనులు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మందలపల్లి సబ్‌స్టేషన్‌కు వెళ్లే రహదారి పనులు పూర్తి కాలేదు.
జలవాగు రోడ్డు నిర్మాణం ముందుకు సాగడం లేదు.
పెద్దగొల్లగూడెం–మల్కారం రహదారిలో లంక ప్రాంతం వద్ద పనులు నిలిచిపోయాయి.
గుత్తావారిగూడెం–గంగులగూడెం రహదారి దుస్థితికి చేరుకుందని ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .