ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం.

ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం.

వనపర్తి,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో దాదాపు 39 సంవత్సరాల పాటు శాస్త్రవేత్తగా సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన వెంకటేశ్వర్లును సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ ఆదివారం షాద్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు తన వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ అంతరిక్ష శాఖలో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. శాస్త్రవేత్తగా మూడున్నర దశాబ్దాలకు పైగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారని తెలిపారు.ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించాయని పేర్కొన్నారు.అనంతరం పలుస శంకర్‌గౌడ్, శైలజ దంపతులు వెంకటేశ్వర్లు, పద్మ దంపతులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.
శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.
పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.