ముల్కనూర్ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
భీమదేవరపల్లి, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన కమిటీని ఆదివారం 20 యాదవ కుల వంశస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ చైర్మన్‌గా జక్కుల మల్లికార్జున్, వైస్ ప్రెసిడెంట్లుగా దొండ ఐలయ్య, గిరబోయిన కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ముడికే భిక్షపతి, క్యాషియర్‌గా జక్కుల రాజమౌళి ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా పల్లవేన రమేష్, గండు రమేష్, ముడికే రమేష్, ముష్కే లింగయ్య, జక్కుల రాజయ్య, గిరబోయిన రాజు, చేపూరి రమేష్, రాదారపు రాజు, తనుగుల పెద్ద వెంకటరాజ్యం, ఉడత కొమరయ్య,దొండ బిక్షపతి,కొత్తపెల్లి సమ్మయ్య, బండారి జీవన్, అదరి రాజేందర్, మామిడి కుమారస్వామి, కూకట్ల ఓదెలు, బర్మ రవీందర్, సకినాల రమేష్, ముష్కే పూర్ణచందర్, భైరవేన ఐలయ్య, పిట్టల సాయి పవన్‌లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా యాదవ కుల పెద్దలు మాట్లాడుతూ, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని, ఆలయ నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే వార్షిక ఉత్సవాలు, ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ అభివృద్ధి, భక్తుల సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు, గ్రామ ప్రముఖులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments