వెల్టూర్ లో రైతు నమోదు ప్రక్రియపై అవగాహన.

మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్.

వెల్టూర్ లో రైతు నమోదు ప్రక్రియపై అవగాహన.

పెద్దమందడి,జూన్09(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో రైతు నమోదు (ఫార్మర్ రిజిస్ట్రేషన్) ప్రక్రియపై మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ రైతులకు అవగాహన కల్పించారు.ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాల ప్రయోజనాలు రైతులకు సక్రమంగా అందాలంటే రైతు నమోదు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ.. రైతులు తమ భూమి వివరాలు, వ్యక్తిగత సమాచారం మరియు అవసరమైన పత్రాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని తెలిపారు.నమోదు ప్రక్రియ పూర్తయిన రైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంటల సంబంధిత సేవలు మరియు ఇతర వ్యవసాయ ప్రయోజనాలను సులభంగా పొందగలరని వివరించారు.అలాగే రైతులు నమోదు సమయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News