కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.

ఐదుగురు అరెస్టు – న్యాయస్థానానికి తరలింపు.

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.

ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశారు.IMG-20260614-WA0053
వైరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసులు శనివారం కొణిజర్లలోని ఇంధన నింపే కేంద్రం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని తనిఖీ చేశారు.
తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్ర, కామారెడ్డి జిల్లాలకు చెందిన అమూల్ నానోబా గోరే, వసంత్ జాధవ్, లక్ష్మణ్ నాగనాథ్ కరే, షేక్ అన్సర్, షేక్ రహ్మత్‌లుగా గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి 201.45 కిలోల ఎండు గంజాయి, ఏడు చేతి దూరవాణులు, నగదు రూ.2,800, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,00,50,000గా అధికారులు అంచనా వేశారు.
అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాదారులు, స్వీకరించాల్సిన వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .