ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.

కలెక్టర్‌కు సమాచార హక్కు సాధన కమిటీ వినతి.

ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.

హుజురాబాద్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండ నరేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, తిరగమల్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.IMG-20260615-WA0164

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .