ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.

 సైదాపూర్ , జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించారు.
ఈ తీర్మానం ప్రకారం నర్సరీ నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలను బొమ్మకల్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా (నీటి) పన్ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సర్పంచ్ వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. విద్య కోసం పన్ను రాయితీ ప్రకటించడం ద్వారా బొమ్మకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ చారిత్రాత్మక తీర్మానం ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలవనుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి. నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.
వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని...
ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.
వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.
కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.