కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.

కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.

హుజూరాబాద్, జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
పట్టణ అభివృద్ధి పేరుతో లేదా ఇతర కారణాలతో మైదానాన్ని ఆక్రమించేందుకు చేసే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, క్రీడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్‌ను యథాతథంగా పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న తూర్పాటి రాజు, కళాశాల గ్రౌండ్‌పై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు కలిసి గ్రౌండ్ పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .