ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.

హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్‌పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్‌పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధుIMG-20260617-WA0059మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .