వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.

వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.

పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని సర్పంచ్ అశోక్ సూచించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .