పాలమూరు ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం వృథా.

పాలమూరు ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం వృథా.

సీఎం పర్యటనలు రాజకీయ ప్రచారానికే 

-- బీఆర్ఎస్ జిల్లా నాయకులు  సురేష్ కుమార్

వనపర్తి,జూన్04 (తెలంగాణ ముచ్చట్లు):

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పర్యటనలు ప్రజాధనాన్ని వృథా చేసే రాజకీయ కార్యక్రమాలేనని జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.ఉమ్మడి పాలమూరు జిల్లాకు సమీపంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో జిల్లాకు ఉపయోగపడే ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో అందించలేదని ఆరోపించారు.రైతాంగానికి నీటి వనరులు కల్పించాలనే చిత్తశుద్ధి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు ఎప్పుడూ లేదన్నారు.ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పేరుతో సీఎం రెండు రోజుల పర్యటన చేపట్టడం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు సభలు, పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.ఇటీవల రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు.రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందన్నారు.ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రాజెక్టుల పేరుతో పర్యటనలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన సురేష్ కుమార్, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, రైతు సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .