జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.

జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.

జమ్మికుంట టౌన్ జూన్ 03 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు పాల్గొని భక్తులకు భోజనాలను పంపిణీ చేశారు. హరీష్ రావు ప్రజాసేవా దృక్పథం, తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్, ప్యాక్స్ చైర్మన్ పొనగంటి సంపత్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి, మాజీ కౌన్సిలర్లు బొద్దుల రవీందర్, జుగురు సదానందం, గాజుల భాస్కర్, పాతకాల రమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భోగం వెంకటేశ్, మద్ది సంపత్, రామడుగు రవీందర్, మైస రవి, వార్డు అధ్యక్షులు గూట్ల మల్లికార్జున్, పరిమళ మాణిక్యం, పొనగంటి సందీప్, హరీష్ రావు అభిమానులు అప్పని హరీష్ అండ్ టీం,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. IMG-20260603-WA0089

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .