మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు
ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత
చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన తమ చిన్ననాటి మిత్రుడు, సహపాఠి ముక్కెర గోపాల్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందిన ఆయన స్నేహితులు కుటుంబానికి అండగా నిలిచారు. గోపాల్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సహాయంలో కెనడాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు కస్తూరి శ్రీధర్ తన మానవతా దృక్పథాన్ని చాటుతూ వ్యక్తిగతంగా రూ.1 లక్ష విరాళంగా అందించారు. మిగిలిన రూ.50 వేల మొత్తాన్ని ఇతర మిత్రులు కలిసి సమకూర్చి కుటుంబానికి అందజేశారు.
కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవడంలో కస్తూరి శ్రీధర్ చూపిన ఉదారత, సేవాభావం, మానవతా హృదయం అందరి ప్రశంసలను అందుకుంటోంది. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామం, బాల్య మిత్రులు, వారి కుటుంబాల పట్ల అనుబంధాన్ని మరువకుండా అవసర సమయంలో పెద్ద మనసుతో ముందుకు రావడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని మిత్రులు కొనియాడారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
మిత్రుడి కుటుంబం కష్టకాలంలో ఒంటరిగా లేదనే భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో కూడా తమ సహకారం కొనసాగుతుందని మిత్రులు తెలిపారు. ముక్కెర గోపాల్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ ఆర్థిక సహాయం అందజేసిన వారిలో కస్తూరి శ్రీధర్ (కెనడా), మర్రి దుర్గాప్రసాద్, సాధం సతీష్, కన్నేబోయిన రాజ్ గోపాల్, కుంచాల రాజన్న, దాసరి కుమారస్వామి, పోచంపల్లి రాజు, మోడెం వెంకట్రాజం, కొండబోయిన కోటిశ్వర్, వేల్పుల తిరుపతి, పిట్టల రాజు, బక్క రాజు, కన్నేబోయిన శేఖర్, తప్పేట రాజేష్, ఇసురం రమేష్ (బుడ్డి), గుర్రపు రమేష్, కిరణ్ కుమార్ (కేజీఎం), భూక్యా రమేష్, బోయిని రవి పాల్గొన్నారు.


Comments