కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,జూన్09( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము వెంకటస్వామిని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు.నూతన బాధ్యతల్లో కొమ్ము వెంకటస్వామి విజయవంతంగా రాణించి పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, మద్దూరు నరసింహ, 7వ వార్డు సభ్యుడు దిండు నాగరాజు, మన్నెంకొండ ఎం.డి. సాదిక్, మద్దూర్ వెంకటయ్య, గొర్రె విజయ్ కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments