చలో కొడంగల్‌.. తెలంగాణ ఉద్యమకారుల పిలుపు.

చలో కొడంగల్‌.. తెలంగాణ ఉద్యమకారుల పిలుపు.

జమ్మికుంట టౌన్ జూన్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలులో ముందడుగు వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా కొడంగల్‌లో నిర్వహించనున్న సభను, చేవెళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొడంగల్ వరకు చేపట్టనున్న "చలో కొడంగల్" కారు ర్యాలీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కడి సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను చేర్చడం, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే కమిటీని ఏర్పాటు చేయడం ఉద్యమకారుల విజయంగా అభివర్ణించారు. కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల ఉద్యమకారులతో పాటు కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని కారు ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమారస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆరే రమేష్ రెడ్డి, రేణిగుంట్ల రజినీకుమార్, జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు రాం రాజబాబు, ఎజ్జే తిరుపతి, ఇమ్మడి రాజు, మోతే స్వామి, జిల్లా కార్యదర్శి కనవేని సతీష్ కుమార్, రచ్చ గణేష్, అక్కనపెళ్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .