250 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మికుంట పీర్ల స్థలానికి రక్షణ కల్పించాలి.

250 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మికుంట పీర్ల స్థలానికి రక్షణ కల్పించాలి.

జమ్మికుంట టౌన్ జూన్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన పీర్ల పండుగ నేటికీ మతసామరస్యానికి ప్రతీకగా కొనసాగుతోందని ముస్లిం పెద్దలు తెలిపారు. అయితే ఇంతటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పీర్ల స్థలానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రహరీ గోడ, శాశ్వత గది నిర్మించాలని ప్రజాప్రతినిధులు, దాతలను వారు కోరుతున్నారు.

ముస్లిం పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్నో సంవత్సరాల క్రితం ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలి కొసకు పీరీ తగిలి భూమి పైకి రావడంతో ఆ ప్రాంతం పవిత్ర స్థలంగా గుర్తించబడింది. అనంతరం గ్రామస్థుల సహకారంతో గౌడ కులానికి చెందిన భూదాతలు ఆ స్థలాన్ని పీర్లకు విరాళంగా అందించగా, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ పండుగలో ముస్లింలతో పాటు హిందూ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం, మట్టికుండలు సమర్పించడం, గుండంలో నడవడం వంటి ఆచారాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి వచ్చి మొక్కులు తీర్చుకునే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారని స్థానికులు పేర్కొన్నారు.

అయితే పీర్లను భద్రపరిచే శాశ్వత గది లేకపోవడంతో ఉత్సవాలు ముగిసిన తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందని, ఎండ, వానలకు గురవుతూ పీర్లకు నష్టం కలుగుతోందని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.

దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ప్రహరీ గోడతో పాటు ఒక గది నిర్మిస్తే పీర్లను శాశ్వతంగా అక్కడే భద్రపరచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పటికీ ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని వారు అన్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, దాతలు స్పందించి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ పీర్ల స్థలాన్ని అభివృద్ధి చేసి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముస్లిం పెద్దలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన. మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.
వనపర్తి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు): తిరుపతిలోని శ్రీ మహతి ఆడిటోరియంలో స్వామివారి దివ్య సన్నిధిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సాత్విక కూచిపూడి అకాడమీ' విద్యార్థులు తమ అద్భుత కూచిపూడి నృత్య...
హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.
చెత్తకు చెక్.. పచ్చదనానికి శ్రీకారం!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.