సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.

సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.

పెద్దమందడి,జూన్25(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అత్యంత అవసరమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తన సొంత గ్రామమైన మంగంపల్లిలోనే ఓటు హక్కు కొనసాగాలని నిర్ణయించుకుని సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన ఓటు హక్కు సొంత గ్రామంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం, వివరాలను సరిచేసుకోవడం, కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.గ్రామ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బలమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు విలువైనదేనని, నా ఓటు – నా హక్కు అనే భావనతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నమోదు పత్రాన్ని గ్రామ స్థాయి అధికారి నారాయణమ్మ నుంచి స్వీకరించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .