నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.
మంచిర్యాల, జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు)
మందమర్రి పట్టణంలో శనివారం ఉదయం జాతీయ రహదారిపై పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా వారి వద్ద నుండి సరైన లేబుల్స్, బిల్లులు లేని సుమారు 100 కేజీల విడి నకిలీ పత్తి విత్తనాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు, అధిక ఆదాయమే ధ్యేయంగా రైతులను మోసం చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పేర్కొన్నారు, నిందితులకు ఈ విత్తనాలు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు, నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న కానిస్టేబుళ్లు శ్రీనివాస్, చైతన్య, రాకేష్, మహేందర్, సంతోష్ లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.


Comments