మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.

మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.

జమ్మికుంట టౌన్ జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల సీపీఎం పార్టీ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జక్కుల రమేష్ యాదవ్‌కు జమ్మికుంట మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు సింగవేనా ఓదెలు యాదవ్ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా కార్మికునిగా, కార్మిక సంఘం నాయకునిగా జక్కుల రమేష్ యాదవ్ నిరంతరం కార్మికుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్నారని కొనియాడారు. అలాంటి ఉద్యమ నాయకుడిని సీపీఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎన్నుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఐక్యంగా ఉద్యమాలను ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పల్లెబోయిన రాజు, సంపత్ యాదవ్, తెడ్ల ఓదెలు యాదవ్, శ్రీనివాస్, దండిగారి సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .