తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది.

ముకుంద నాయుడు జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్.

తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది.

వనపర్తి,జూన్30(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణలో జనసేన పార్టీ వేగంగా ప్రజాదరణ పొందుతూ భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పార్టీ వనపర్తి కోఆర్డినేటర్, రాష్ట్ర యూత్ వింగ్ నాయకుడు ముకుంద నాయుడు అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారినే పార్టీలో చేర్చుకుంటామని, రానున్న స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్  ఎన్నికల్లో జనసేన తన సత్తా చాటుతుందని తెలిపారు.తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చూసి ప్రత్యర్థి పార్టీలు అనవసర విమర్శలకు దిగుతున్నాయని అన్నారు.ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపైనే జనసేన ప్రధానంగా పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వరకు ప్రజల తరఫున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ విధానం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా, మండల నాయకులు, వీర మహిళా విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .