జమ్మికుంట మున్సిపల్లో ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు.

జమ్మికుంట మున్సిపల్లో ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు.

జమ్మికుంట టౌన్ జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక మరియు తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుదైన నాయకుడిగా రోశయ్య దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. మృదుస్వభావి, నిజాయితీ గల ప్రజానాయకుడైన రోశయ్య జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. యువత రోశయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .