ఉద్యాన విద్యలో రెండేళ్ల డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
పెద్దమందడి,జూన్07(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన కొల్లాపూర్ ఉద్యాన పాలిటెక్నిక్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఉద్యాన విద్య డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీణా జోషి తెలిపారు.ఈ కోర్సులో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026 లేదా పదో తరగతి (లేదా దానికి సమానమైన పరీక్ష)లో ఉత్తీర్ణులై ఉండి, ఉన్నత మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు అర్హులని ఆమె పేర్కొన్నారు.ప్రవేశాలు విశ్వవిద్యాలయం నిర్దేశించిన నిబంధనలు, ప్రతిభా జాబితా ఆధారంగా నిర్వహించబడతాయని తెలిపారు.దరఖాస్తు పత్రం, ప్రవేశ సమాచార పుస్తకం, ఇతర వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక జాలగూడు ద్వారా పొందవచ్చని తెలిపారు.పూర్తి చేసిన దరఖాస్తులను 2026 జూలై 5వ తేదీలోగా రిజిస్ట్రార్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, ములుగు గ్రామం, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా–502279 చిరునామాకు పంపించాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.మరిన్ని వివరాలకు 8977129027, 7683053157, 7981018479 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.


Comments