నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

ఆర్డీఓకు కానాయపల్లి గ్రామపంచాయతీ వినతి.

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

కొత్తకోట,జూన్06 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని భీమా ఫేజ్-2లో భాగంగా శంకర సముద్రం రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కానాయపల్లి నిర్వాసితుల సమస్యలపై గ్రామపంచాయతీ తీర్మాన కాపీ సమర్పించాలని ఆర్డీఓ సూచించడంతో శనివారం గ్రామ సర్పంచ్ బొంతం శిరీష సాయి ఆధ్వర్యంలో తీర్మాన కాపీని ఆర్డీఓకు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాసితుల తరఫున పలు డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ప్రత్యేక ప్లాట్లు, ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు కల్పించాలని, సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా గుర్తించిన 95 మందిని పీఎఎఫ్ నుంచి పీడీఎఫ్‌లోకి మార్చి అందరికీ సమానంగా ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. అలాగే నిర్వాసితులందరికీ రూ.12.50 లక్షల షిఫ్టింగ్ చార్జీలు చెల్లించాలని, సర్వేలో పేర్లు నమోదు కాని 31 మందికి పునఃసర్వే నిర్వహించి ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం, 1129 ప్లాట్లను లెవలింగ్ చేసి పట్టా సర్టిఫికెట్లు అందజేయడం, స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించడం, దేవాలయాల కోసం స్థలం కేటాయించడం, నూతన పాఠశాల భవనానికి విద్యార్థుల రాకపోకల కోసం రవాణా సౌకర్యంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఆర్డీఓ, నిర్వాసితుల సమస్యలను ఆర్ అండ్ ఆర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా ఉందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, ఉప సర్పంచ్ అంజి నాయక్, వార్డు సభ్యులు గోకరయ్య, రాములు యాదవ్, చిన్న వెంకటయ్య, సుజాత బాలరాజు, తెలంగాణ ఉద్యమకారుడు శేఖర్ గౌడ్, నాయకులు ధనుష్, కుర్మయ్య, బాబు, తోకలి బీమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
కొత్తకోట,జూన్06 (తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని భీమా ఫేజ్-2లో భాగంగా శంకర సముద్రం రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితుల సమస్యలను...
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకం.
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ సాయం చేరవేసిన ఎమ్మెల్యే.
పారిశుద్ధ్యం, ఓటర్ల సవరణ, పంటల మార్పిడిపై అవగాహన కల్పించిన వార్డు సభ.
ఇందిరమ్మ విగ్రహం పునఃస్థాపనకు కాంగ్రెస్ డిమాండ్.
దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి!