పర్యావరణ పరిరక్షణకు మొక్కలే మార్గం.
మనిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్.
Views: 6
On
పెద్దమందడి,జూన్05తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమందడి మండలంలోని మనిగిల్ల గ్రామంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ పల్లె ప్రగతి పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలు, గ్రామ కార్యదర్శి వెంకటేష్‌తో కలిసి పలు రకాల మొక్కలను నాటారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments