నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.

ప్రభుత్వంపై మిట్టపల్లి సురేందర్ ఆగ్రహం.

నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.

హుజురాబాద్, జూలై 5 (తెలంగాణ ముచ్చట్లు): 

నియోజకవర్గ కేంద్రంగా, వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై కీలక పట్టణంగా ఉన్న హుజురాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు గత కొన్ని నెలలుగా నిలిచిపోవడంపై కరీంనగర్ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మిట్టపల్లి సురేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నెలలు గడుస్తున్నా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. హుజురాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు పార్సిళ్లు, వస్తువుల రవాణా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కార్గో సేవలు నిలిచిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని, ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఇలాంటి పరిస్థితి కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
హుజురాబాద్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను తక్షణమే పునరుద్ధరించాలని మిట్టపల్లి సురేందర్ డిమాండ్ చేశారు.IMG-20260705-WA0023

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .