జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ట్రైనింగ్ కలెక్టర్ హరిప్రసాద్.

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ట్రైనింగ్ కలెక్టర్ హరిప్రసాద్.

జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ట్రైనింగ్ కలెక్టర్ పి. హరిప్రసాద్‌కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఘన స్వాగతం పలికి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ట్రైనింగ్ కలెక్టర్‌కు అధికారులు వివరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణను ఆయన పరిశీలించారు.
తర్వాత వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ కలెక్టర్ పి. హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, వైస్ చైర్మన్ ముంతాజ్ జావేద్ అలీ, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20260707-WA0021

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .