దొడగుంటపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.

దొడగుంటపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.

పెద్దమందడి,జూలై07(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదిగల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎమ్మార్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అలాగే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను నిర్వహించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామపంచాయతీ రోడ్డు వద్ద గ్రామ సర్పంచ్ కొమ్ము పెంటయ్య మాదిగ జెండాను ఆవిష్కరించగా, కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా రాజీలేని పోరాటంతో అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ కృషి చేస్తోందన్నారు. మాదిగలకే కాకుండా సమాజంలోని అన్ని పీడిత వర్గాల పక్షాన ఉద్యమిస్తూ ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమం, రేషన్ బియ్యం పెంపు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వంటి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగానే తెలంగాణలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చి మాదిగలకు 9 శాతం రిజర్వేషన్లు దక్కాయని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.దేశంలో 100 శాతం విజయవంతమైన ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడిన ఆయన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. ప్రతి ఏడాది జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని శ్రేణులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొమ్ము శాంతమ్మ, మాజీ ఉపసర్పంచ్ కొమ్ము చెన్నమ్మ, బీసీ సంఘం నాయకులు గుపాని వెంకటేష్, రవీందర్, మాజీ వార్డు సభ్యులు కొమ్ము తిరుపతయ్య మాదిగ, యువకులు శ్రీను, కొమ్ము దేవరాజు, నాగన్న, కొమ్ము బాలకృష్ణ, మహిళలు బక్కమ్మ, కురవతమ్మ, కొండమ్మ, జానకమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం. హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం.
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):  హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు...
వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక.
ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.
దొడగుంటపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.
25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.
వెల్టూర్ చేనేత సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లకు ఘన సన్మానం.
అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.