రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థి ఎంపిక.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థి ఎంపిక.

పెద్దమందడి,జూలై08(తెలంగాణ ముచ్చట్లు):

ఈ నెల 9, 10, 11 తేదీలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి గ్రామానికి చెందిన పదో తరగతి పూర్తి చేసిన పి. శివశంకర్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న తెలిపారు. శారీరక విద్య ఉపాధ్యాయుడు మన్యం యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శాంతన్న మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీలలో శివశంకర్ ప్రతిభ కనబరిచి విజయం సాధించి రాష్ట్రానికి, జిల్లాకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శివశంకర్‌ను పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మహేశ్వరమ్మ, గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి, ఉపసర్పంచ్ ఉషన్న, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .