భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.

భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.

భీమదేవరపల్లి, జూలై 11, తెలంగాణ ముచ్చట్లు 

భీమదేవరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన చల్లని తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.50 వేల విలువైన 80 లీటర్ల సామర్థ్యం గల బ్లూ స్టార్ వాటర్ కూలర్‌ను శనివారం నాడు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమానికి మార్పాటి వెంకట రాజి రెడ్డి, మార్పాటి జయప్రకాశ్ రెడ్డి, మార్పాటి ప్రదీప్ రెడ్డి, మార్పాటి ప్రవీణ్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దాతలు అందించిన ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో మరింత మంది దాతలు విద్యాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్. భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు సుధారాణి, ప్రదీప్ కుమార్, రాజేంద్రం, మోహన్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొని దాతలను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థులు సైతం దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.