అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

**డబుల్ బెడ్రూమ్ గృహలు పేదలకే*

*బిఆర్ఎస్ హయాంలో నాయకులకే పథకాలు అంటూ ఏద్దేవా చేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ*

మంచిర్యాల,జులై,11(తెలంగాణముచ్చట్లు) 

మందమర్రిలో పారదర్శకంగా అందజేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అమలులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి,  జిల్లా ఎస్ సి సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్ ఆరోపించారు, శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లలో ఇప్పటికే అర్హులైన 250 మందికి ఇళ్లను అందజేశామని మిగతా ఇళ్ల అమలు కోసం ఇటీవల జాబితాను అధికారులు విడుదల చేశారని జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లిన వాటిని సవరించేందుకు మాత్రమే అధికారులు జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు, దీనిపై ఎలాంటి అవగాహన లేకుండా అధికారులను సంప్రదించకుండా ఇష్టానుసారంగా అవినీతి ఆరో పణలు చేయడం సిగ్గు చేటని  తెలిపారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళిత బందు పథకం పట్టణంలో ఎంత మంది అర్హులకు అమలు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు, అర్హులైన నిరుపేదలకు కాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యక
ర్తలకు అందజేసి అసలైన నిరుపేదలకు అన్యాయం చేశారని పేర్కొన్నారు, బిసి, మైనార్టీ కార్పొరేషన్ పధకాలలో బి ఆర్ ఎస్ నాయకులు డబ్బులు తీసుకొని అనర్హులకు ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు, అధికారుల పర్యవేక్షణలో వారి పరిశీ లనలో నిజమైన అర్హులకే డబుల్ రూమ్ ఇళ్లను పారదర్శకంగా అందజే సేందుకు మంత్రి వివేక్ వెంకట స్వామి కృషి చేస్తున్నారని జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా బి ఆర్ ఎస్ నాయకులు అధికారులను సంప్రదించి అనర్హుల వివరాలను ఇవ్వాలని అన్నారు, ప్రభుత్వం పై గాని మంత్రి వివేక్ వెంకటస్వామి పై గాని అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హేచ్చరించారు, ఈ సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, మంకు రమేష్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. పాష, నాయకులు దుర్గం ప్రభాకర్, రాచర్ల గణేష్, బండి శంకర్, వనం నరసయ్య, సట్ల సంతోష్, ఎండి,ఇసాక్  తదితరులు పాల్గోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.